తిరుపతి, ఫిబ్రవరి 17 : అంతర్జాతీయ దేవాలయాల సదస్సు లో పాల్గొన్న అనంతరం సోమవారం సాయంత్రం 8.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన గౌరవ ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు లభించింది.
రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, టిటిడి ఈ ఓ శ్యామలరావు,అడిషనల్ ఈఓ వెంకయ్యచౌదరి,డీఐజీషిమోషిబాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, పూతలపట్టు, ఎమ్మెల్యేలు పులివర్తి వెంకట ముని ప్రసాద్(నాని) బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, మురళీ మోహన్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తాసిల్దార్ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.




