ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నాయి బ్రాహ్మణ కులంలో పుట్టి న భారతరత్న స్వర్గీయ కర్పూరి ఠాకూర్ 37 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి పూజలు జరిపి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక నాయకుడిగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు ముఖ్యంగా అంటరానితనం, నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రి గా ఆ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించడం వెనుకబడి వర్గాలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం అలాంటి మహనీయుడు సేవలు స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించాము ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాలు ఇంచార్జ్ పి షణ్ముగం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, మరియు నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శిరిమా* *వెంకటేష్, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు
C.V. ప్రతాప్, రజక సంఘం నాయకులు అరుణ్ కుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు పి. షణ్ముగం, మాజీ చైర్మన్ చిత్తూరు కోపరేటివ్ బ్యాంక్ మరియు దక్షిణాది రాష్ట్రాలు* *ఇన్చార్జి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం



