
అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేయాలని ఎఫ్ ఎల్ ఎన్ కోర్స్ డైరక్టర్,బలిజిపేట మండల విద్యాశాఖాధికారి -1 సామల సింహాచలం అన్నారు.మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంగన్వాడి టీచర్ల కు ఆరు రోజుల ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యలో నూతన విద్యా విధానాలను ఈ శిక్షణలో బాగా అవగాహన చేసుకోవాలని కోరారు. ప్రాథమిక విద్యకు పునాది స్థాయి అంగన్వాడి కేంద్రాలని, కాబట్టి ఐసిడిఎస్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో 0 నుండి 5 సంవత్సరాల బాల బాలికలకు నూతన బోధనా పద్ధతుల ద్వారా విద్యను అందించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో చదువుతున్న చిన్నారులకు భాష, గణితం లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.కావున శిక్షణకు హాజరైన అంగన్వాడి టీచర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకుని తమ కేంద్రాల్లో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. మొదటి విడత మూడు రోజులపాటు 20వ తేదీ వరకు, రెండో విడత 22 నుండి 25 వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికిరిసోర్స్ పర్సన్స్ గా ఎస్ వెంకటేష్, కె రమేష్ బాబు, గుల్ల రామారావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంఈఓ 2 కె శ్రీనివాసరావు,స్థానిక పాఠశాల హెచ్ఎం పి శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సిడిపిఓ సులేఖ, సూపర్వైజర్ పద్మావతి, స్టాఫ్ సెక్రటరీ ఎం పైడపు నాయుడు, అంగన్వాడీ టీచర్లు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


