పర్యావరణ రక్షిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ..

Sesha Ratnam
1 Min Read

పాకాల మండలం, గరుడ (న్యూస్ ప్రతినిధి): ప్రస్తుతం మార్కెట్లో పర్యావరణ రక్షిత శానిటరీ ప్యాడ్స్ విరివిగా వస్తున్నాయని, వాటిని వాడటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని లయన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ మారసాని విజయబాబు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కౌమారా బాలికలకు నెలసరి ఆరోగ్యం పైన అవగాహనా కార్యక్రమం, పర్యావరణ రక్షిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సత్యం చారిటబుల్ ఫౌండేషన్ వారి సహాయంతో ఈ కార్యక్రమం అనేక పాఠశాలల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఆర్ ఎస్ మానసకు కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. కాకినాడ నుంచి విచ్చేసిన వి ఉమెన్ ఫర్ ఉమెన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రమ్య సుధ గుబ్బల ఏకో ఫ్రెండ్లీ పాడ్స్ యొక్క ఉపయోగాలు ప్లాస్టిక్ పాడ్స్ వలన కలిగే దుష్పలితాలు విద్యార్థినులకు వివరించారు. నెలసరి సమయంలో తీసుకోవలిసిన పరిశుభ్రత, నెలసరి చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు, నెలసరి అవశ్యకత మరియు పౌష్టికహర లాభాలు వివరించారు. అనంతరం లయన్ సభ్యురాలు మారసాని గౌరి విద్యార్థినీలకు పర్యావరణ రక్షిత ప్యాడ్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల ట్రెజరర్ మారసాని నాగేంద్ర, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర, సైన్స్ టీచర్ భాగ్యలక్మి, బల్లే కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *