పార్వతీపురం క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర నిర్వహించిన ప్రజా దర్బార్ కు మంచి స్పందన కనిపించింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు. బాధితుల సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత శాఖల అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపారు.