
శ్రీకాళహస్తి ఆరే మరాఠా అసోసియేషన్ చే…
-ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆరే మరాఠా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వంచారు. ది స్కూల్ ప్రాంగణంలో ఉన్న స్వర్గీయ శాంతారామ్ రావు జె. పవార్ విగ్రహం వద్ద శివాజీ చిత్ర పటానికి పూజలు, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి.వి.ఆర్ గ్రూప్ డైరెక్టర్ జనార్దన్ రావు జె పవార్ మాట్లాడుతూ ఛత్రపతీ శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం తన ఎంతో పోరాటం చేసారన్నారు. ఆయన తెలివితేటలు, యుద్ధతంత్రాలు, శత్రువులపై వ్యూహాత్మక దాడులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పదోల్కర్ సత్యనారాయణ అన్నారు. శివాజీ రాజ్యపాలనలో ధర్మబద్ధమైన, సమానత్వపూరిత పాలన ఉండేదని మోరే ఉమేష్ రావు తెలిపారు. అలాగే ఆయన తెలివితేటలు, యుద్ధతంత్రాలు, శత్రువులపై వ్యూహాత్మక దాడులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో పడ్లోకర్ మహేశ్వర్ రావు, ఎన్.భాస్కర్ రావు, దయానంద రావు, సదారాం, హరి రావు, ప్రసన్నకుమార్, గోవర్ధన్ రావు, రాజశేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

