శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం

ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ అభ్యర్థిగా ఏపిటీఎఫ్ తరపున శాసనమండలి ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న పాకలపాటి రఘు వర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. పార్వతీపురం మండలంలోని నర్సిపురం, సీతానగరం మండలాల్లో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన ఏపిటీఎఫ్ నాయకులతో కలిసి రఘు వర్మకు మొదటి (1) ఓటు వేయాలని ఉపాధ్యాయ పట్టభద్రులను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఏపిటీఎఫ్ నాయకులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.



