కమ్యూనిటీ పోలీసింగులో భాగం గా మెగా వైద్య శిబిరం

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
3 Min Read

శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం

పార్వతీపురం మన్యం జిల్లా,  డొకిశీల గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  ఆదేశాల మేరకు,పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన,ఐపిఎస్  సూచనలతో పోలీసుశాఖ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంను బుధవారం  నిర్వహించారు. మెగా వైద్య శిబిరానికి పార్వతీపురం రూరల్ సర్కిల్ సిఐ గోవిందరావు , పార్వతీపురం రూరల్ ఎస్సై సంతోషి  హాజరయ్యి ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామాలకు సహాయపడుతూ, గిరిజనులకు అండగా నిలిచేందుకుగాను కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. జిల్లా ఎస్పీ  ఆలోచనల ప్రకారం సిఐ  పర్యవేక్షణలో పార్వతీపురం రూరల్ ఎస్సై ఎస్ఐ  విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్, డొకిశీల PHC, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కలిసి సుమారు 07 మంది వైద్య బృందం తమవంతు సహాయాన్ని, సేవలను అందించేందుకు ముందుకు వచ్చారని కొనియాడుతూ,కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనదని ,ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అలా చూపడంతోనే భవిష్యత్తులో ఆరోగ్యంగా జీవించగలమన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో జనరల్ సర్జన్, ఫిజీషియన్,ENT, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఆర్తోపెడిక్,పాథాలజీ వైద్యులు ఉన్నారని, వారిందరి సేవలను వినియోగించుకోవాలని, వీటితో పాటు బ్లడ్ ప్రజర్, సుగర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్యులు వ్రాసిన మందులను కూడా ఉచితంగా అందిస్తామని, వాటిని సక్రమంగా వాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, జాగ్రతలు పాటించినట్లయితేనే ఈ వైద్య శిబిరం నిర్వహించిన ఉద్దేశ్యం, లక్ష్యం నెరవేరుతుందన్నారు.

పార్వతీపురం రూరల్ సర్కిల్ సిఐ గోవింద రావు మాట్లాడుతూ – మారుమూల గిరిజనులు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో జీవిస్తూ,తగిన వైద్యం పొందేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించి, గిరిజనులు ప్రధానంగా ఎదుర్కొంటున్న కంటి సమస్యలు, హృద్రోగం, గర్భాశయ సమస్యలు ఇతర అనారోగ్య కారణాల పరిష్కారానికి ఆయా రంగాల్లో నిపుణులను ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొనే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టారని, ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 350మందికి పైగా ప్రజలు మారుమూల గ్రామాల నుండి హాజరుకాగా, వారికి జనరల్ సర్జన్, ENT, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఆర్తోపెడిక్,పాథాలజీ వైద్యులు లు వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసారు. ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను, మరియు సేవలందించిన వారిని గారు ప్రత్యేకంగా అభినందించి, జిల్లా పోలీసుశాఖ తరుపున జ్ఞాపికలను అందజేసారు.

- Advertisement -
Ad image

అనంతరం, జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్,ఐపిఎస్  ఆదేశాల మేరకు కమ్యునిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలతో మమేకమై, వృద్దులకు,మహిళలకు, దివ్యాంగులకు గొడుగులు, స్టీల్ గ్లాస్ లను పార్వతీపురం టౌన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి  రూరల్ సి.ఐ ఎస్. గోవింద రావు, ఎస్సై బి. సంతోషి మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేసారు. గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు గిరిజన యువతకు ఉచితంగా వాలీబాల్ కిట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద రావు,పార్వతీపురం రూరల్ ఎస్ఐ సంతోషి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి ,వైద్యులు డా., రాహుల్ జనరల్ ఫిజీషియన్, డా., సౌజన్య MS జనరల్ సర్జన్, డా., శ్రీకాంత్ MS ఆర్తోపెడిక్, డా., కౌశిక్ సివిల్ సర్జెన్, డా., రాజ్ ప్రేం గురుబక్ష్ని పాథాలజీ, డా., కోటేశ్వర రావు ENT, డా., కౌశిక్,ఐశ్వర్య మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామా పెద్దలు , పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు,పిల్లలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *