
👉సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…… పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్

👉జిల్లాలో సోషల్ మీడియా దుర్వినియోగం, పోస్టులపై పోలీసులు, సైబర్ సెల్ ,సోషల్ మీడియా టిమ్ ద్వారా నిరంతరం ప్రత్యేక నిఘా.
👉యువత సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండవలెను…..జిల్లా ఎస్పీ
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమానకర రీతిలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని ప్రముఖ వ్యక్తులపై, మహిళలపై, పిల్లలపైన, సంస్థలపై గాని హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో ఫొటోలు/వీడియోలు మార్ఫింగ్, ట్రోలింగ్ చేసినా, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరుల మనోభావాలు, మానాభిమానులు దెబ్బతినేలాగానీ కుల/మత/రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన, సున్నిత అంశాల్లో వదంతులు/అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, హేయమైన, విద్వేషకర పోస్టులు చేసే వారిపై, నిజానిజాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు లేదా తప్పు దారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించటం, సహకరించటం, కుట్ర చేయటం వంటివి కూడా చట్టరీత్య నేరమని తెలిపారు.
సామజిక మాధ్యమాలలో ఒక వ్యక్తీని కించపరచాలని,వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కోసం చేసే పోస్టల వలన భాదితులు తీరని మనోవేదనికి గురవుతారని,వాటి పరిణామం వలన కొన్ని సార్లు వారు ప్రాణాలను కూడా కోల్పెయే పరిణామాలు చూస్తున్నామని కావున ఎవరు సామజిక మాధ్యమాల్లో అటువంటి పోస్టులు పెట్టరాదని, గ్రూప్లలో పెట్టేటప్పుడు అడ్మిన్ కూడా దానికి బాధ్యులు అవుతారని అందువల్ల అడ్మిన్లు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు..
సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు, సైబర్ సెల్ ,సోషల్ మీడియా టిమ్ ద్వారా నిరంతరం గమనిస్తూ ఉంటారని, కావున సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్టుల ద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఒకసారి కేసు నమోదు అయితే ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్ట్, వీసాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయని అదేవిధంగా సమాజంలోని,కుటుంబ సభ్యుల వద్ద అప్రదిష్ట పాలవుతారని జిల్లా ఎస్పీ సూచించారు.
