
కొత్తపేట, గరుడ న్యూస్ (ప్రతినిథి): యువత భరోసా కూటమి ప్రభుత్వం బాధ్యత.. నిరుద్యోగుల వెతలు తీర్చేది ఎన్డీఏ ప్రభుత్వం…పట్టభద్రులకు అండగా పేరాబత్తుల…పేరాబత్తులకు పట్టభద్రులంతా పట్టం కట్టాలి : ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడి. రావులపాలెం పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడి,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీ గణేష్ కుమార్,వాసిరెడ్డి రాంబాబు,ఆకుల రామకృష్ణ,అయినవిల్లి సత్తిబాబు గౌడ్… యువతకు భరోసాగా తెలుగుదేశం,జనసేన,భాజపా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీ గణేష్ కుమార్,వాసిరెడ్డి రాంబాబు,ఆకుల రామకృష్ణ,అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నియమించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే దాదాపు విజయం ఖాయమైందని పేర్కొన్నారు.ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే పేరాబత్తుల రాజశేఖర్ కు అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో 17 పోలింగ్ స్టేషన్ లు,11వేల 159 మంది పట్టభద్రుల ఓట్లు వున్నాయని అన్నారు.కోనసీమలో 95 పోలింగ్ కేంద్రాలు,కోనసీమ జిల్లాలో మొత్తం 64 వేల మంది ఓటర్లు ఉన్నారని అలాగే ఉభయ గోదావరి జిల్లాలో 456 పోలింగ్ కేంద్రాలు,3 లక్షల 14 వేల 984 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు తీసుకొస్తున్నాయని చెప్పారు.దాంతో 4 లక్షల 10 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు.యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు.నాడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సిద్ధంగా ఉన్నామని వచ్చే విద్యా సంవత్సరానికి నూతన ఉద్యోగులు విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. పూర్తి మద్దతుతో రాజశేఖర్ ను గెలిపిస్తాం: జనసేన ఇంచార్జి శ్రీనివాస్. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు పూర్తి మద్దతుతో గెలిపిస్తానని జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు.నియోజకవర్గంలో భారీ మెజారిటీ వచ్చేలా జనసేన పార్టీ శ్రేణులంతా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
రాజశేఖర్ గెలుపు తథ్యం : కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం తథ్యమని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్,నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీకులు పీవీ గణేష్ కుమార్ అన్నారు.కొత్తపేటలో మంచి నాయకత్వం ఉందని నియోజకవర్గంలో ఉన్న ఓట్లన్నీ దాదాపు కూటమి అభ్యర్థి రాజశేఖర్ కే దక్కించుకుంటారని చెప్పారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

