శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మూడు రోజులు పాటు నిర్వహించిన లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. వందలాది మంది ఉభయ దారుల ఆధ్వర్యంలో పూజలు శాస్రోక్తంగా నిర్వహించారు. హాజరైన ఉభయదారులందరికీ ఆలయ సాంప్రదాయం ప్రకారం సన్మానించారు. ఆఖరి రోజు పూజలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏ సి ఓ ఏకాంబరం ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులు గంగిరెడ్డి మరియు అర్చకులు పాల్గొన్నారు.





