ఎమ్మెల్సీ అభ్యర్థికి విద్యాసంస్థల మద్దతు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం

పార్వతీపురం, ఫిబ్రవరి 21 :    ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాకలపాటి రఘువర్మకు పార్వతీపురం పట్టణంలోని అయిదు విద్యాసంస్థలు పూర్తి మద్ధతు తెలియజేసాయి. ఆ పాఠశాలలకు ఎమ్మెల్యే విజయచంద్ర  ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం వెళ్లి ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు వేయాలని కోరారు. ఎమ్మెల్యే  కోరిక మేరకు పట్టణంలోని వాసవి , గాయత్రి , శ్రీజన్ , వేదాంత , ఆర్ కె సురేష్ పాఠశాలల యాజమాన్యాలు తమ మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తామంతా ఉంటామని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ బొడ్డి పైడిరాజు, సిహెచ్ రామ్మోహన్ నాయుడు , మరియు విద్యాసంస్థల కరస్పాండెంట్స్ మణికుమార్, శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *