
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు,ఫిబ్రవరి 24, గరుడ న్యూస్ (ప్రతినిధి): సాలూరు నియోజకవర్గానికి 2 వ ఎమ్మెల్యే దివంగత అల్లు ఎరుకు నాయుడు.1955 లో ప్రజా సోషలిస్టు పార్టీ తరుపున కూనిశేట్టి నారాయణ దొర పై పోటీ చేసి ఓటమి చెందారు.తదుపరి 1962 లో రాజాలక్ష్మి నరసింహ నారాయణ రాజు పై పోటీ చేసి విజయం సాధించిన సంగతి తలచుకున్నారు.అప్పుడు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ గా ఉండేది.ఈ ఎన్నికల తరువాత ఎస్టి నియోజకవర్గం గా నేటి వరకు కొనసాగుతుంది.మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర ఆద్వర్యం లో పూలమాలలు వేసి నివాళులర్పించారు.


