
గరుడ టీవీ న్యూస్ (ప్రతినిధి సురేంద్ర బాబు)
సోమల, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన గార్గేయ మునీశ్వర స్వామికి మాఘమాసం నాల్గవ సోమవారం పంచామృత అభిషేకాలు చేసి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు త్రివిక్రమ స్వామి ఆధ్వర్యంలో వేకువ జామున 5 గంటలకు దుర్గం కొండలో వెలిసిన గార్గేయ మునీశ్వర స్వామికి కోనేరు నుంచి సేకరించిన పవిత్ర నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరణ చేసి మహా మంగళ హారతి సమర్పించారు. స్వామివారి దర్శనానినికి విచ్చేసిన భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని కోరుతూ కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తులందరికీ స్వామి వారి పవిత్ర విభూది పూలు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వినయ్ కశ్యప్ తోపాటు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.

