
తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): ఉచిత కన్సల్టేషన్ తో పాటుగా మందులు 500 మందికి పైగా లబ్దిపొందారు, 20 మందికి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ర్లు పాల్గొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్యమే మహాభాగ్యము అని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు, జెసిఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షురాలు ఈ.త్రిషాల అన్నారు. ప్రణీత్ ఫౌండేషన్, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, తిరుపతి ఒడిస్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని ఉచిత వైద్య శిబిర సేవలను అందుకున్నారు. మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివారం అయినప్పటికీ వైద్యులందరూ పేదలకు సేవల అందించాలనే దృక్పథంతో ఉచిత వైద్య శిబిరానికి రావడం చాలా సంతోషకరమని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు అన్నారు.ప్రతి నిత్యం క్యాంపులో ఏర్పాట్లు, పరీక్షలు, మందుల పంపిణీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ క్యాంపు విజయ వంతానికి కృషి చేసిన జె సి ఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షురాలు ఈ.త్రిషాలను శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ చైర్ పర్సన్ పీ.సులోచన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గుండె వైద్య నిపుణులు వెంకటరమణ మాట్లాడుతూ ఇటువంటి మెడికల్ క్యాంపులో పాల్గొని తన వంతు సేవలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సేవా కార్యక్రమాలు చేయడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని జెసిఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షురాలు ఈ త్రిషాల స్పష్టం చేశారు.ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపుగా 500 మంది పాల్గొని ఉచిత కన్సల్టేషన్ తో పాటుగా మందులను కూడా పొందారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులకు ప్రణీత్ పెనుమాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత మెగా ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న ప్రముఖులకు జే.సీ.ఐ వారు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. రంగనాయకులు శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్, డాక్టర్ ప్రశాంత్ పెనుమాడు మెడికల్ డైరెక్టర్ టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, జె సి ఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మనోహర్, జెసిఐ ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ ఎన్.బి హర్షవర్ధన్, జె సి ఐ 26 వ జోన్ అధ్యక్షులు భరత్ కుమార్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రముఖులు, 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


