గరుడ టీవీ న్యూస్ (ప్రతినిధి):చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్
K.మల్లికార్జున రెడ్డి. పవిత్ర మహా శివరాత్రి పర్వదినాన ఆలయాల్లో పూజలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము రెండు గంటల నుండి శివాలయాన్ని శుద్ధిచేసి పరమశివునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ ఆకృతులతో స్వామివారికి పుష్పాలంకరణలు చేశారు. మహా మంగళహార సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు రద్దీ నెలకొన్నది. క్యూలైన్లలో భక్తులందరూ ఉపవాసాలతో స్వామివారికి పూజలను నిర్వహిస్తున్నారు. అలాగే సోమవారం మండలం దుర్గం కొండలో వెలసిన గార్గేయమనిశ్వర స్వామికి అర్చకులు త్రివిక్రమ స్వామి బాల వినయ్ కస్యఫ్ లు పూజలు చేసి మహా మంగళహారతి సమర్పించారు. పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ పార్టీల నాయకులు విస్తృతంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ జరుగుతోంది. అన్నదానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.




