పార్వతీపురం మన్యం జిల్లా,పాచిపెంట,ఫిబ్రవరి 26,(గరుడ న్యూస్)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పారమ్మకొండ, పాచిపెంట మండలంలో శ్రీ పారమ్మతల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పారమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు సంతృప్తికరంగా అందాలని, ప్రతీ ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని పారమ్మ తల్లిని వేడుకున్నారు.
పారమ్మతల్లి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పారమ్మ కొండ శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మౌనవ్రతం పాటించి శివార్చన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివుని ఆరాధనలో భాగస్వాములయ్యారు.




