
తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి,): తిరుచానూరు యోగి మల్లవరంలో శివాలయం ఆలయంలో ఘనంగా అన్నదానం కార్యక్రమం జరిగింది. బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్వామివారికి ఉదయం అభిషేకం అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ రాఘవేంద్ర క్యాటరింగ్ యజమాని డిస్కో శివ మరియు యోగి మల్లవరం యువజన సంఘం తరపన కమల్ నాదన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమము జరిగింది


