పి కోనవలస గ్రామంలో రైతు గునాపు రామారావు అర ఎకరం క్షేత్రంలో ప్రకృతి సేద్య యల్ టు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుళి పద్ధతిలో చోడి పంట నాటించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు గుళి పద్ధతిలో చోడి పంట పండించే విధానాన్ని వివరిస్తూ రైతులతో కలిసి గులిచోడి నాట్లు వేశారు. సాధారణ పద్ధతి కంటే గుళి పద్ధతిలో రెట్టింపు చోడి దిగుబడి వస్తుందని కాబట్టి రైతులు మెత్తని ఎత్తైన నారుమడి పోసుకొని 15 రోజులకు ఒక్కొక్క మొన అడుగున్నర దూరంలో నాటుకుంటే ఎక్కువ పిలకలు వస్తాయని ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని పంట కాలంలో నాలుగు లేదా ఐదు సార్లు పారించుకోవాలని 15 రోజులకు ఒకసారి 30 రోజులకు రెండవసారి అంతర కృషి చేయాలని, గడ్డి లేకుండా చూసుకుంటే అధిక దిగుబడి సాధ్యమని తెలిపారు నాటిన 25 రోజులు కు తేలికైన చెక్కను అడ్డంగా లాగాలని దానివలన కుదుళ్ళు బాగా కదిలి పిలకలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. రైతు గూనాపు రామారావు మాట్లాడుతూ ప్రకృతి సేద్య పద్ధతిలో వరి పండించినప్పుడు అధిక దిగుబడి సాధించానని తప్పనిసరిగా ఇప్పుడు కూడా గులి పద్ధతిలో అధిక దిగుబడి సాధిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య సిబ్బంది సురేష్ తిరుపతి నాయుడు, కుమార్, సుమలత పాల్గొన్నారు.




