పార్వతీపురం పట్టణం, గరుగుబిల్లి లలో వున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ


పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఐపిఎస్ జిల్లా వ్యాప్తంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపద్యంలో,పార్వతీపురం పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల, గరుగుబిల్లి లో జిల్లా పరిషత్ స్కూల్ లో గల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఉపాద్యాయులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఉపాద్యాయ శాసనమండలి ఎన్నికలు గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం , కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలలో జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ సుడిగాలి పర్యటన చేస్తూ పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. క్యూలైనులు, ఎన్నికల తీరును, భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఓటర్లు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలింగ్ కేంద్రంలోకి పంపాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు అనుమతించవద్దని జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేసి, పలు భద్రతాపరమైన సూచనలు చేసారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 15 ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా అనుకోని సమస్య తలెత్తితే వెంటనే చేరుకునే విధంగా రూట్ మొబైల్ పార్టీలను, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంటే ప్రత్యేక బృందాలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాయన్నారు. జిల్లాలో మొత్తం 301 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరు గుంపులుగా ఉండరాదన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించిన, అవాంఛనీయ ఘటనలు సృష్టించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఉపాద్యాయులు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి సూచించారు.



