గరుడ న్యూస్,పాచిపెంట రూరల్:
క్యారంగి గ్రామాన్ని ప్రకృతి సేద్య గ్రామంగా తీర్చిదిద్దాలంటే రైతుల తోడ్పాటు ఎంతో అవసరమని వ్యవసాయ అధికారి కే. తిరుపతి రావు అన్నారు గ్రామ రైతులు , గ్రామ పెద్దల ఆకాంక్ష మేరకు ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలరోజులుగా గ్రామ పెద్దలు ప్రకృతి వ్యవసాయ సన్నద్ధత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరడం ఆనందదాయకమని గిరిజన రైతులందరూ ప్రకృతి సేద్యం దిశగా నడవాలని కోరారు అనంతరం గ్రామం నుండి పదిమంది రైతులు ప్రకృతి సేద్యం చేయటానికి ముందుకు వచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా, నేలల ఆరోగ్యం పోషకాల లభ్యత పెంపొందించాలన్నా, ఆరోగ్యవంతమైన పంటలు పండించి ప్రజల ఆరోగ్యం కాపాడాలన్న భూతాపాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని పెంచుకోవాలన్నా, ప్రకృతి సేద్యమే ప్రధాన ఆయుధం అని తెలిపారు. రైతులు చిరుధాన్యాల సాగును పెంచాలని ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి చిరుధాన్యాలను కొనుగోలు చేస్తుందని ఘన ద్రవ జీవామృతాలను వినియోగిస్తే పోడు భూములలో కూడా అధిక దిగుబడి పొందవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు కూడా నీటి పంపులు అవసరమని పై అధికారులకు విషయాన్ని తెలియజేయమని కోరారు. అనంతరం గ్రామంలో చెక్ డ్యాం అవసరమైన ప్రాంతాన్ని అలాగే శిథిలమైన చెక్ డాం ను పరిశీలించి రైతుల అవసరాలను జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా కలెక్టర్ వారికి తెలియజేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య l2 సురేష్ గ్రామ వ్యవసాయ సహాయకులు అనిల్ కుమార్ గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.




