సాలూరు,(గరుడ న్యూస్)
సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల లో భాగంగా మేకల శంకరరావు ని సాలూరు నియోజకవర్గానికి గ్రీవెన్స్ సెల్ విభాగం అధ్యక్షులుగా నియమించడమైనది. ఈ సందర్భంగా మాజీ ముఖ్య మంత్రి వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి,మాజీ డిప్యూటీ సీఎం పీడిక.రాజన్నదొరకి జిల్లా వైసీపీ అధినాయకులకు, సాలూరు పట్టణ వైసీపీ నాయకులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. పిడిక రాజన్నదొర వెంట నడుస్తూ పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని మీడియాకు తెలిపారు.




