
గరుడ న్యూస్, చీపురుపల్లి
02 మార్చి నెల 2025న
చీపురుపల్లి లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27 వ వార్షికోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్. సీ.పీ.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గంవై.యస్.ఆర్.సీ.పీ. సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ బాబు , కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) అమ్మవారికి పట్టు దుస్తులు సమర్పించి, ఆదివారం దర్శనం చేసుకున్నారు.ముందుగా ఆలయ కమిటీ సభ్యులు సాదరస్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వారి పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వారికి వేద ఆశీర్వచనం అందించారు.


