మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కీలక సమీక్షా సమావేశం…

Panigrahi Santhosh kumar
1 Min Read

(గరుడ న్యూస్,సాలూరు)

మార్చి 8వ తేదీన
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో మార్చి 4 న కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంకా అధికారులు పాల్గొన్నారు.
మార్చి 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం లో జరిగే ఈ మహిళా దినోత్సవంకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈ సమావేశంలో మహిళల సాధికారత, భద్రత, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆర్థిక స్వావలంబనం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *