
మహిళా భద్రతే ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్.,ఆదేశాల మేరకు మార్చి 8 వ తేదీన జరగబోవు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్.,తెలిపారు.
మార్చ్ 8 వ తేదీన జరగబోవు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మార్చి 1వ తేది నుండి మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని,ఈ మహిళా సాధికార వారోత్సవాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల, కళాశాల విద్యార్దినులకు ఓపెన్ హౌస్, మెడికల్ క్యాంప్ , ఆటలు, చిత్రలేఖన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు,వ్యాసరచన పోటీలు, వక్తృత్వ(ఉపన్యాసం)పోటీలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలియజేసారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించడం, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను తెలియజేయడం, అలాగే మహిళల శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలకు, విద్యార్థినులకు రక్షణగా ఎల్లప్పుడూ పోలీస్ శాఖ “మేమున్నాము మీకు తోడుగా” అనే భావన కల్పించడం వలన పోలీసులు లేదా పోలీస్ స్టేషన్ల పై వున్న అభద్రతాభావం తొలగిపోయి, ఏమైనా సమస్యలు వుంటే ఆ సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పోలీసు అధికారులకు సులభంగా తెలియజేసేందుకు అవకాశం వుంటుందని, ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారి భద్రతకు మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకు అవకాశం వుంటుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని, మహిళల భద్రత, రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

ఏఎస్పీ మాట్లాడుతూ : మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకొని, వాటిని వినియోగించుకోవాలి. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ధైర్యంగా ఉండాలి, మహిళలు పురుషులతో సమానమన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలి..మహిళలు చదువుకొని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లోనూ రాణించాలి. మహిళలు తమ పిల్లలకు మంచి విద్యను అందించి తద్వారా తమ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అంకిత సురాన తెలియజేసారు.
పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహాయం,సహకారాలు ఉంటాయని, మహిళలు/చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్:1098, ఉమెన్ హెల్ప్ లైన్:181,పోలీస్ హెల్ప్ లైన్:100 / 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్:1930, కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలన్నారు.
ఈ ర్యాలి కార్యక్రమంలో ఎస్పీ తో పాటుగా పార్వతీపురం సబ్-డివిజినల్ అధికారి అంకిత సురాన,ఐపిఎస్ , జిల్లా ICDS అధికారి కనకదుర్గ , పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్, పార్వతీపురం రూరల్ సిఐ గోవింద రావు, ఎస్సైలు, మరియు MSP విద్యార్దులు, అంగన్వాడి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



