మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన 14 మంది కి 1,40,000 వేల రూపాయలు జరీమన విధించినట్లు పార్వతిపురం టౌన్ సిఐ కే. మురళీధర్ తెలిపారు. వివరాల ప్రకారం మంగళ, బుధ వారం నాడు పార్వతిపురం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం 14 మంది వ్యక్తులకు కలిపి 1,40,000 రూపాయల జరిమానా విధించారు. రెండోసారి మద్యం సేవించి వాహనం నడిపి దొరికినట్లయితే మూడు నెలలు జైలు శిక్ష విధించబడుతుందని కోర్టు హెచ్చరించారు.




