
(గరుడ న్యూస్,సాలూరు)
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం సాలూరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆద్వర్యంలో సాలూరు మహిళా సంఘ సభ్యులు, పురపాలక సిబ్బంది , మెప్మా సిబ్బంది, ఆర్ పి లు, సి.ఓ లు, సి.యం.యం. , డి.ఇ ఓ,నీడ్ ఎన్జీవో వేణుగోపాలరావు ర్యాలీ లో పాల్గొన్నారు.సహనానికి ప్రతిరూపం మహిళ అని, మహిళా దినోత్సవం స్పూర్తిని ప్రతి రోజు కొనసాగించాలని అన్నారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతను కృషి చెయ్యాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

