

నాగల్గి గిద్ద మండలంలోని ముక్టాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు జరిగిన వార్షికోత్సవ వేడుకలు కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా నిర్వహించడం జరిగింది.ఈ వార్షికోత్సవ వేడుకలలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు,నృత్య ప్రదర్శనలు,ఉపాన్యాసాలు చూపరులను ఎంతో ఆకట్టు కోవడం జరిగింది.ఈ వేడుకలలో స్థానిక ఎంఈఓ మన్మధ కిషోర్,మనూర్ ఎంఈఓ రాజశేఖర్,పిఆర్టియు నాయకులు మధుసూదన్ రెడ్డి,మహేష్ కుమార్, నాగనాధ్,రాజు,జీవన్ రాథోడ్,కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు శంకర్,బాబ్ శెట్టి,రవీందర్,విజయేందర్ రెడ్డి,విఠల్ రెడ్డి,పాండురంగా రెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయులు అంజిరెడ్డి,లింగమేశ్వర్,శేరికర్ రమేష్, సంగమేశ్వర ,ఉమేష్ పాటిల్,గ్రామ పెద్దలు మాణిక్ రావు పాటిల్ ఇతర పెద్దలు,గ్రామ యువత, గ్రామస్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


