
పార్వతీపురం నియోజకవర్గం నుంచి యువత పోరు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి – మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారం చేపట్టి ఇప్పటికే సుమారుగా 10 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేక ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అలానే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య, విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్ధులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు చెల్లించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 12వ తేదీన తలపెట్టిన “యువత పోరు” జిల్లా కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజింగి జోగారావు తో కలిసి క్యాంప్ కార్యాలయంలో ఇరువురు కలిసి పార్టీ క్యాడర్ కు సంయుక్తంగా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, విద్యార్ధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. 12వ తేదీన ఉదయం 10 గంటలకు వైయస్ఆర్ విగ్రహం వద్ద ప్రారంభమై భారీ ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు విద్యార్ధి విభాగ అధ్యక్షులకు పూర్తి సహాయ, సహకారం అందించి, కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారిని సమాయత్తం చేయాలి అని పార్టీ ముఖ్య నేతలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాములు నాయుడు, మూడు మండలాలు మరియు పురపాలక సంఘం పార్టీ అధ్యక్షులు బోమ్మి రమేష్, బొంగు చిట్టి రాజు, పాలవలస మురళీకృష్ణ మరియు కొండపల్లి బాలకృష్ణ, జిల్లా పార్టీ కార్యదర్శులు, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
