
రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు (ప్రతినిధి): సంస్థాన్ నారాయణపురం, మార్చి08: నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి అని సమాజంలో సమాన అవకాశాలు పొందాలి అని అన్ని రంగాల్లో పోటీగా నిలవాలని అన్నారు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగమంటూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతూ సంపూర్ణ మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మహిళ సాధికారికత కోసం ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి తరఫున మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి.

