తిరుపతి జిల్లా, టిటిడి గరుడ న్యూస్ (ప్రతినిధి): టీటీడీ ఉద్యోగులకు చీరల కిరణ్ అనే వ్యక్తి పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎందుకంటే టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి, వారి ఉద్యోగంలో ఒడిదుడుకులకు సంబంధించి, ప్రతి ఒక్క విషయంలో నేనున్నా అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేటువంటి గొప్ప వ్యక్తి చీర్ల కిరణ్, వడివడిగా సాగుతున్న టీటీడీ రిలే రన్నింగ్ రేస్ (4×100)లో చీర్ల కిరణ్ జట్టు విజేతలుగా నిలిచింది. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా నేడు జరిగిన పురుషుల రిలే రన్నింగ్ రేస్ (4×100) విజేతలు గా చీర్ల కిరణ్, విష్ణువర్ధన్, రోహిత్, రాజేష్ జట్టు విజేతలుగా నిలిచింది. రెండవ స్థానంలో రవికుమార్ రెడ్డి జట్టు, మూడవ స్థానంలో మణికంఠ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా పలువురు చీరల కిరణ్ జట్టుకు అభినందనలు తెలియజేశారు.





