
సాలూరు, మార్చ్ 09,గరుడ న్యూస్ ప్రతినిధి : నాగార్జున
పార్వతిపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, ఈరోజు సాలూరు పట్టణ పరిధిలో అన్ని ఆటో యూనియన్లు, వాటి పరిధిలో గల ఆటోలకు *ఒకే పట్టణం, ఒకే ఆటో, ఓకే సంఖ్య విధానం* అమలు చేస్తూ అన్ని ఆటోలకు సీరియల్ నంబర్లు ఇవ్వడం జరిగింది. సదరు ఆటోలకు సంబంధించిన ఆటో రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటుగా, ఈ నూతన నంబరింగ్ ఖచ్చితంగా ఆటోలకు అతికించి, వాటి వివరాలను ఆటో యూనియన్ల వారు తమ వద్ద ఆటోలకు సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించవలెను. సదరు ఆటో యూనియన్ లలో గల ఆటోల యొక్క రిజిస్టర్ల సమాచారం పోలీస్ స్టేషన్లో కూడా నమోదవుతాయి. ఈ **ఒకే పట్టణం, ఒకే ఆటో, ఓకే సంఖ్య విధానం* యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ పరిధిలో మొత్తం ఆటో యూనియన్ల సంఖ్య మరియు ఆటోల సంఖ్య పాటుగా వాటి యాజమానులు మరియు డ్రైవర్లు, వాటికి సంబంధించిన రికార్డులు యొక్క అన్ని వివరాలు నమోదు చేసుకోబడతాయి. ఈ విధానం వలన పక్క రాష్ట్రాల నుండి లేదా వేరే ప్రాంతాల నుండి వచ్చే ఆటోల సమాచారం మరియు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన నాటుసారా, గంజాయి రవాణా
మరియు ఇతర నేర ప్రవృత్తి గల చర్యలను నిరోధించేందుకు మరియు కనిపెట్టేందుకు, ఆటో డ్రైవర్లను సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు లేదా రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించే ఆటోల వివరాలను ఈ సంఖ్యల ద్వారా గుర్తించి, పోలీస్ వారికి తక్షణమే తెలియజేసిన యెడల వెంటనే సదరు ఆటో యొక్క వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని సాలూరు పట్టణ సీఐ B.అప్పలనాయుడు ప్రజలకు సూచించడం జరిగింది.
