
గరుడ న్యూస్ సాలూరు
సాలూరు పట్టణం రెల్లి వీధిలో శనివారం సిరుల జాతర సందర్భంగా సిరుల పోతన్న ఎల్లమ్మ ల గద్దె వద్ద భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు వేల సంఖ్యలో బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పూజలు చేస్తే చర్మ సంబంధిత రుగ్మతలు నయం అవుతాయని ప్రతీతి.

