
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫర్,మార్చ్11,(గరుడ న్యూస్ ప్రతినిధి): మీకు నేనున్నానంటూ కన్న కొడుకులా భరోసా..నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి కంటిచూపు బాగుండాలని వైద్య శిబిరాలు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కన్నకొడుకు లాగా మారి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.కంటి వైద్య శిబిరాలలో ఆపరేషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళని హైదరాబాదులోని నానక్ రాం గూడ లో ఉన్న శంకరా కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ లు చేయిస్తున్నారు.బిజీ షెడ్యూల్లో కూడా శంకరా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తున్న తీరుని దగ్గరుండి పరిశీలించారు.ఆపరేషన్లు పూర్తయిన వారికి పండ్లు అందించి ఆత్మీయంగా పలకరించారు.కొన్ని అనివార్య కారణాలవల్ల ఆపరేషన్లు కాని వ్యక్తుల ప్రొఫైల్ ను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.త్వరలో వారికి కూడా ఆపరేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.మునుగోడు నియోజకవర్గంలో కంటిచూపుతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఇబ్బంది పడొద్దంటూ ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జనవరి 19 న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9న నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నాలుగవ ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది.ఈ వైద్య శిబిరంలో 1153 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 340 మంది ఆపరేషన్లకు సెలెక్ట్ అయ్యారు. ఆపరేషన్లకు సెలెక్ట్ అయిన వారిని హైదరాబాదులోని శంకర కంటి ఆసుపత్రిలో విడతలవారీగా ఆపరేషన్ లు చేస్తారు.ఓవైపు రాజకీయాలు మరోవైపు వ్యాపార కార్యక్రమాలలో బిజీ గా ఉన్నప్పటికీ తన ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం అంతటి బిజి షెడ్యూల్ లో కూడా హైదరాబాదులోని శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆత్మీయంగా పలకరించి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

