
*అనాధీనం భూముల్లో అక్రమ కట్టడాలు అనుమతి లేదంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన తాహశీల్దార్*
తొట్టంబేడు మండలం చిట్టత్తూరు రెవెన్యూ లెక్క దాఖలా DKT భూములు 1500 ఎకరములు కలవు ఈ భూములు ,శ్రీకాళహస్తి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉండడంతో, స్థానికులు కాకుండా,శ్రీకాళహస్తి తిరుపతి, తిరుత్తని, చిత్తూరు, ఇతర ప్రాంతాల వారు కన్నేసి, అనాధీనం భూముల్లో అక్రమ కట్టడాలు కడుతుంటే గత ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ భూముల పందారం చేసింది అందులో భాగంగా సర్వే నెంబర్ 40.1.40-3 లో 2 ఎకరాల భూమి కే వి బి పురం మండలం గురకల కండ్రిగ గ్రామానికి చెందిన గవర్నమెంట్ ఉద్యోగి ఈ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసినట్టు తేలింది, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన అధికారులు ఈ అక్రమాలను గుర్తించి హెచ్చరిక బోర్ధంలను ఏర్పాటు చేయడం జరిగినది అంతేకాకుండా చిట్టత్తూరు రెవిన్యూ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ హెచ్చరించడం జరిగినది
అందులో భాగంగా ఈ దినం తొట్టంబేడు తాసిల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు వీఆర్వో వీఆర్ఏలు కలిసి ఈ హెచ్చరిక బోర్టులను ఏర్పాటు చేయడం జరిగినది
తాసిల్దార్ మధుసూదన్ రావు మాట్లాడుతూ చిట్టత్తూరు రెవెన్యూ పరిధిలో గవర్నమెంట్ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా భూముల్లోకి ప్రవేశిస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు

