
ఉభయగోదావరి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం..
బడ్జెట్ల్ లో మహిళా శిశు సంక్షేమానికి అగ్ర తాంబూలం. 4332 కోట్ల కేటాయింపుతో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన కూటమి సర్కార్ : ఎమ్మెల్యే సత్యానందరావు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అండగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు నిలబడితే నేడు ఆడపడుచులకు అండగా నారా చంద్రబాబునాయుడు ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కోసం డ్వాక్రాతో చంద్రబాబు నాయుడు కృషి చేశారని కొనియాడారు.ఆనాడు చంద్రబాబు ఏర్పాటు చేసిన డ్వాక్రాతో మహిళల స్థితిగతుల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. 2025-26 బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం 4332 కోట్ల రూపాయలు కేటాయించి వారికి అండగా నిలిచామని తెలిపారు. గత వైసీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు ఎక్కువ జరిగాయి తప్ప మహిళల రక్షణ కోసం చర్యలు లేవని అన్నారు. మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.

