

తిరుపతి గరుడ న్యూస్ ప్రతినిధి: పెరుగుతున్న జనాభా దృష్ట్యా తిరుపతిలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. టిటిడి ఆధ్వర్యంలో ఉన్న కాలేజీలు మినహా ప్రభుత్వానికి సంబంధించి కాలేజీలు లేవని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్ళారు. శెట్టిపల్లి భూమలకు సంబంధించి ముప్పయ్ ఏళ్ళుగా సమస్య పరిష్కారం కాలేదని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఆ గ్రామాన్ని సందర్శించి పరిష్కరిస్తామని గతంలో వారు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు గుర్తు చేశారు. గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో శెట్టిపల్లి వాసుల సమస్యను పరిష్కరించకపోగా మున్సిపాలిటీలో కలిపేశారన్నారు. మున్సిపాలిటీ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదన్నారు. 2019లో శెట్టిపిల్లిని తుడా పరిధిలో కలిపారని తిరిగి మున్సిపాలిటీ నుంచి తప్పించి తుడా పరిధిలో వెంటనే చేర్చేలా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే కోరారు. తిరుపతి నగరంలో 30ఏళ్ళ కిందట అండర్ గ్రౌండ్
డ్రైనేజీ సిస్టం వేశారని, పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ సిస్టం ను కూడా మెరుగుపరచాలని కోరారు. డ్రెయినేజీ వ్యవస్థ పాతది కావడంతో నిత్యం డ్రైనేజీ ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని, కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.
