పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు,మార్చి 12,గరుడ న్యూస్:
గంజాయి,నాటు సారా రవాణా పై ప్రత్యేక నిఘా అవసరమని,ఉక్కు పాదం తో వాటిని అణిచివేయ్యాలని,పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ తెలిపారు.సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రొబేషనరీ ఎస్ఐ లకు ట్రైనింగ్ లో భాగంగా దిశా నిర్దేశం చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో సైబర్ క్రైమ్,నక్సలిజం,నాటుసారా,గంజాయి పట్ల అవగాహన కల్పించాలని కోరారు.కూంబింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలని,వాటిని నిర్వహించాలని కోరారు.పోలీస్ స్టేషనుకి వచ్చిన పిర్యాదుదారులకు సమస్య తెలుసుకొని పరిష్కరంకి కృషి చెయ్యాలని, పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధి హైవే నుండి ఆలూరు, మాతుమూరు తదితర ప్రాంతాల వైపుగా ఒడిశా నుండి ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి,నాటు సారా అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమం లో సాలూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొమ్మిడీ అప్పలనాయుడు,సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహ మూర్తి, పాచి పెంట ఎస్ఐ వెంకట సురేష్,ప్రొబేషనరీ ఎస్ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.




