తెలంగాణ, రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చి11,(గరుడ న్యూస్ ప్రతినిధి):
గత 5 ఐదు సంవత్సరాలుగా చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో సమస్యలు పరిష్కరించి పార్టీలకు అతీతంగా ప్రతి వార్డును అభివృద్ధి వైపు తీసుకువెళ్లాను చౌటుప్పల్ పట్టణంలో ప్రధానమైన సమస్యలను పరిష్కరించాను. తెలంగాణ రాష్ట్రంలోనే చౌటుప్పల్ మున్సిపాలిటీ పేరును ముందు వరుసలో ఉంచాను. నాకు ఈ అవకాశం కల్పించిన చౌటుప్పల్ పట్టణ ప్రజలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 5 ఐదు సంవత్సరాలలో చౌటుప్పల్ మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది అందరూ మాకు సహకరించారు. రానున్న రోజుల్లో కూడా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలియజేసుకుంటున్నాను. మీ మాజీ మున్సిపల్ చైర్మన్ వేన్ రెడ్డి రాజు.




