గరుడ ప్రతినిధి :నాగార్జున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉత్తమ సిడిపిఓగా బొత్స అనంతలక్ష్మి ఎంపికయ్యారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో సిడిపిఓ బొత్స అనంతలక్ష్మి ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాం ప్రసాద్, కురుపాం శాసనసభ్యులు తొయక జగదీశ్వరి సాలువతో సన్మానించి సన్మాన పత్రంను అందజేశారు. ఉత్తమ సిడిపిఓ గా ఎంపికైన అనంతలక్ష్మి పాచిపెంట మండలం అధికారులు, ప్రజాప్రతినిధులు, తోటి సిబ్బంది అభినందించారు.



