
ప్రజలందరూ విధిగా గ్లకోమా నేత్రపరీక్షలు చేసుకోవాలి -మన్యం జిల్లా కలెక్టరు
జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక కంటివెలుగు కార్యక్రమంలో బాగంగా కంటి సమస్యలు పరిష్కరించాలని ధ్యేయంగా కంటి సమస్యలు వున్న వారికి నేత్ర పరీక్షలు చేయించడం లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా లయన్స్ క్లబ్ లో నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ, అంతరకుసుమం (కేటారాక్ట్), కొయ్యకండ (టెీరిజియం), నీటికాసుల వ్యాధి (గ్లకోమా) వున్న వారికి ఉచితంగా పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడతామని మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా భాస్కరరావు తెలిపారు. వీరందరికీ ఉచిత రవాణా,వసతి, భోజనం, కళ్ళ జొల్లు,మందులు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నేత్ర పరీక్షలు చేయించుకొని శిబిరాన్ని ప్రారంభిచారు.శస్త్ర చికిత్సలు కు వెళుతున్న రోగులకు పలు సూచనలు,జాగ్రతలు వివరించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు సందర్బంగా జిల్లా అంతటా ఆప్టాల్మిక్ అదికారులు మరియు నేత్ర వైద్య సహాయకులు ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి తగు జాగ్రత్తలు,సూచనలు ఇస్తున్నట్లు డా.భాస్కరరావు తెలిపారు.ఈ కార్య్రమం ద్వారా మా లాంటి పేదలకు కంటి చూపును తెప్పించే బాధ్యత గా తీసుకొని మాకు దగ్గర వుండి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న జిల్లా అంధత్వ నివారణ సంస్థ కి రోగులు ధన్యవాదాలు తెలిపారు. పుష్పగిరి నేత్ర వైద్యులు భరత్,జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో స్థానిక నేత్ర వైద్యులు డా వివేక్,లయన్స్ క్లబ్ చైర్మన్ నాగభూషణ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీరాములు, జిల్లా ఎన్ జి ఒ అధ్యక్షులు కిషోర్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు,రెడ్ క్రాస్ సభ్యులు,ఆరోగ్యకార్యకర్త మరియు ఆషా కార్య కర్తలు పుష్పగిరి కంటి ఆసుపత్రిసిబ్బంది పాల్గొన్నారు.



