
చిత్తూరు మార్చి13 గరుడ టీవీ న్యూస్ (ప్రతినిధి):
సోమల మండలంలోని ఆవుల పల్లె లో గత పది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా అశ్వ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆవుల పల్లె నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి పట్రపల్లె క్రాస్ వద్ద ఉన్న ఫార్వేట మండపానికి తీసుకొచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం నడుమ శాస్రోక్తంగా అర్చకులు పార్వేట ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు అర్చకులు ఉభయదారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


