
గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం
ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం నియోజకవర్గం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్‌లో ప్రజలు వివిద సమస్యల సంబంధించిన వినతి పత్రాలను ఎమ్మెల్యే కు అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు పట్టణంలోని భూ సమస్యలను, గ్రామాలలో మౌళిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్య, విద్యుత్ బల్బులు, వైద్యం మొదలగు వాటిని గుర్తించి పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కారవేదికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలు దీనిని పూర్తి సద్వినియోగ పరుచు కోవాలని సూచించారు.



