

తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాలలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి.. అధికారులకు పనుల వివరాలు అడిగి… కొన్ని సూచనలు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ రోడ్డును సుమారు 50 అడుగుల వెడల్పుతో 0.5కిలోమీటర్లు రోడ్డును 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



