
గరుడ న్యూస్,సాలూరు
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అలుపెరుగని పోరాటం అతని సొంతం…. ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన కారణజన్ముడు “అమరజీవి” పొట్టి శ్రీరాములు. మార్చి 16 న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో విగ్రహానికి, ఇంకా ఆర్యవైశ్య భవన్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మండవిల్లి సాంబశివరావు, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ ,రాపాక నాగ సాయి,ఆర్య వైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వర రావు, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ ఇండుపూరి నారాయణరావు, బలబద్రుని శ్రీనివాసరావు బొర్రా రామారావు, బుడ్డేపు వెంకట అప్పారావు, పూసర్ల శ్రీనివాసరావు మూర్తి, మండ నారాయణరావు, వడ్డాది ఈశ్వరరావు, సముద్రాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

