
గరుడ న్యూస్,పాచిపెంట
వేసవికాలం లో సహజ ప్రకృతి ఎరువులను తయారు చేసుకుని నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకుంటే రైతులకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా నేల స్వభావం బాగుపడి భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో ప్రకృతి సేద్య ఎల్ వన్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో రైతు కె.నారాయణ రావు తయారుచేసిన ఘన జీవామృతం తయారీలో పాల్గొంటూ ఎకరానికి 200 కేజీల పొడి ఘన జీవామృతాన్ని దుక్కిలో వేసుకుంటే తర్వాత పంట కాలంలో ఎకరానికి 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని రెండు లేదా మూడు సార్లు పారించుకుంటే ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదని రసాయన ఎరువులు పై వెచ్చించే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఒక్కసారి తయారుచేసిన ఘనజీవామృతం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందని 200 కేజీల ఆవు పేడకు రెండు కిలోల బెల్లం రెండు కిలోల శెనగపిండి కొంచెం పుట్ట మట్టి కలిపి కొద్ది కొద్దిగా ఆవు మూత్రం కలుపుతూ ఉండలుగా తయారుచేసి చెట్టు నీడన ఆరబెట్టుకుని 15 రోజుల తర్వాత బస్తాలో నిల్వ ఉంచుకుని ఆరు నెలల వరకు వాడుకోవచ్చు అని తెలిపారు ప్రస్తుత వేసవి కాలంలో రైతులకు పొలం పనులు ఉండవు కాబట్టి ప్రకృతి ఎరువుల తయారీకి సమయాన్ని వెచ్చించినట్లయితే డబ్బు ఆదాతో పాటుగా భూమిని బాగు చేసుకోవచ్చని ఘనజీవామృతం వేసిన భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుందని నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటకు కావలసిన అన్ని పోషకాలు అందడమే కాకుండా భూ సారం గా పిలవబడే హ్యూమస్ శాతం కూడా క్రమక్రమంగా పెరుగుతుందని ప్రస్తుతం పంట భూములలో సేంద్రియ కర్బనం కనీసం ఒక్క శాతం ఉండాలని కానీ 0.01 % కంటే తక్కువగా ఉందని కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడితే క్రమక్రమంగా పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయని కాబట్టి రైతులు ప్రకృతి ఎరువుల దిశగా దృష్టి సారించాలని కోరారు అనంతరం సహజ నాడెప్ కంపోస్ట్ పెట్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను, రైతులు పాల్గొన్నారు.

