రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,నాంపల్లి,మార్చ్18,(గరుడ న్యూస్ ప్రతినిధి):
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికసం పథకాన్ని ప్రారంభించడం హర్షనీయమని టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకంతో నిరుద్యోగులు ఆర్థికంగా నిలదోక్కుకొని స్వయం ఉపాధి పొందేందుకు మార్గం ఏర్పడుతుందని ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది చొప్పున రాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు సుమారు 6 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఒక్కో లబ్ధిదారునికి 4 లక్షల వరకు రుణం మంజూరు చేసి 60-80 శాతం వరకూ రాయితీ ఇవ్వడం సంతోషకరం అన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొసారి నిరూపితమైందన్నారు.రాజీవ్ యువ వికాస పథకం సోమవారం నుండి ఆన్లైన్ ప్రక్రియ మొదలైందని ఆసక్తి కలిగిన యువత ఆధార్ కార్డు,కాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ లు జత చెసి ఏప్రిల్ 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ చేసి అర్హులకు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 రోజున మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు.నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొదలని కోరారు.




