రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,మార్చి18,(గరుడ న్యూస్ ప్రతినిధి):
ఎండల తీవ్రత వల్ల నారాయణపూర్,చౌటుప్పల్ మండలాలలో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతున్నాయి తెలంగాణ అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి.రైతులు ఇబ్బందులు పడుతున్నారు తాగునీటికి కూడా కటకట ఏర్పడింది.గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అని చెప్పి 50,000 యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది.వేలకోట్ల అప్పు చేసి పైలాన్ కట్టిన పట్టణంలోనే మిషన్ భగీరథ నీళ్లు లేవు.మిషన్ భగీరథ కోసం వేలకోట్ల రూపాయల అప్పులు చేసిన ధనం కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లినాయి కానీ మిషన్ భగీరథ పర్పస్ ప్రాక్టికల్ గా అందలేదు.2011 జనాభా లెక్కల ప్రకారం చౌటుప్పల్ పట్టణానికి తాగునీటి కేటాయింపులు జరిగాయి..అక్కడ ఉన్న పరిశ్రమల వల్ల జనాభా పెరిగింది.జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు లేవు.తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.సత్వరమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత శాఖ మంత్రులకు అసెంబ్లీలో విన్నవించారు.




