రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,వాచ్య తండా,మార్చ్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకితమైన నాయకుడు,ప్రజల గుండెల్లో స్థానమున్న యువ నేత, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్),రేపు 20/03/2025 న సూర్యాపేటలో జరిగే నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు.ఈ సందర్భంగా,ఆయన చౌటుప్పల్ నుండి ప్రయాణిస్తుండగా,చౌటుప్పల్ బస్టాండ్ ఆవరణలో జనహృదయనేత,ప్రజా సేవలో నిత్యం మమేకమయ్యే నిరాడంబరమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రజా నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికే కార్యక్రమం ఉన్నది.భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు,కార్యకర్తలు,నాయకులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై,మన నాయకులకు అఖండ మద్దతును తెలియజేయాలని కోరుకుంటూ,భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలను ఆహ్వానిస్తున్నాం మీ వాకుండోత్ రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు.




