రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చి19,(గరుడ న్యూస్ ప్రతిని):
అన్ని వర్గాలకు సమచిత న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుపతి రవీందర్ అన్నారు.అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ,బిసి రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేసాడు.ఈ సందర్భంగా తిరుపతి రవీందర్ మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు ఆమోదం చేయడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు.ఎన్నికల హామీలో భాగంగా మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించి మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు.గత ప్రభుత్వం తుంగలో తొక్కిన కార్పొరేషన్ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఒక దృఢ సంకల్పంతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీ అభినందనలు తెలియజేయడం జరిగింది.దేశంలోనే ఏక్కడ చేయలేని విధంగా బిసీలకు రిజర్వేషన్ కల్పించారాని అదేవిధంగా ఎస్సీలకు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటానికి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు యువతకు న్యాయం చేయాలని ఒక దృడ సంకల్పంతో యువతకు రాష్ట్రంలో 6000 కోట్లు నిధులు విడదల చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ప్రజలకు న్యాయం జరగాలంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ఓబీసీ వైస్ చైర్మెన్ తిరుపతి రవీందర్ తెలియజేశారు.
